ఇస్లామాబాద్ : సింధూ నదీ వ్యవస్థపై భారతదేశం తీసుకునే చర్యలు తమ దేశ నీటి భద్రతకు ముప్పు కలిగిస్తాయని భావిస్తే, తాము సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆదివారం హెచ్చరించారు.
సింధూ జలాల ఒప్పందంపై వివాదం ముదురుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఏఆర్వై న్యూస్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ‘నీరు అనేది తమ దేశ కీలక జాతీయ భద్రత అంశమని, సింధూ నదీ పరీవాహక జలాలపై తమకున్న హక్కులకు ఎలాంటి ముప్పు పొంచి ఉన్నట్లు అనిపించినా మరుక్షణమే భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తాం. ఇది ఖాయం’ అని అన్నారు.