వాషింగ్టన్: కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. 2023 జూన్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. దీనికి నిరసనగా ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది. దీంతో కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు, మిషన్స్ భద్రత, రక్షణ పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎస్ఎఫ్జేపై భారత్ 2019లో నిషేధం విధించింది. ఎస్ఎఫ్జే విడుదల చేసిన రెచ్చగొట్టే పోస్టర్లో, కెనడాలోని ఇండియన్ హై కమిషనర్ దినేశ్ పట్నాయ్పై తుపాకీ గురి గుర్తును ముద్రించారు. ఖలిస్థానీ మద్దతుదారులపై కెనడాలోని ఇండియన్ మిషన్స్ నిఘా పెడుతున్నాయని ఓ ప్రకటనలో ఆరోపించింది. కెనడాలో హిందుత్వ ఉగ్రవాదానికి కొత్త నాయకుడిగా దినేశ్‌ను అభివర్ణించింది.