ఢాకా: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. ఛాతి ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు సహా గత అనేక సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 1991 నుంచి 1996 వరకు, తిరగి 2001 నుంచి 2006 వరకు రెండు పర్యాయాలు ఖలీదా బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు.
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా. ఆమె పెద్ద కుమారుడు, బీఎన్పీ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ తారీఖ్ రెహ్మాన్ 2008 నుంచి లండన్లో నివసిస్తూ డిసెంబర్ 25న బంగ్లాదేశ్ తిరిగి వచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఖలీదా జియా నామినేషన్ పత్రాలను సోమవారం ఆమె పార్టీ నాయకులు సమర్పించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. జియా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.