గురువారం 28 మే 2020
International - May 18, 2020 , 21:16:53

వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ అధ్యక్షురాలిగా కెవా బెయిన్‌

వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ అధ్యక్షురాలిగా కెవా బెయిన్‌

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్‌ అసెంబ్లీ అధ్యక్షురాలిగా బహమాస్‌ దేశానికి చెందిన కెవా బెయిన్‌ ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన 73 వ వార్షిక సమావేశంలో కెవా బెయిన్‌ నియామకం  జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తీసుకొనే అన్ని ప్రధాన నిర్ణయాలు వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీలోనే తీసుకొంటారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ఈ కీలక సమయంలో ప్రజలను కరోనా నుంచి ఎలా రక్షించాలన్నదే ప్రధాన ధ్యేయంగా పనిచేద్దామని సూచించారు. కెవా బెయిన్‌.. బహమాస్‌ దేశం శాశ్వత ప్రతినిధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్నారు. ప్రస్తుత సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. 


logo