పెన్సిల్వేనియా: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అందానికి మళ్లీ ఫిదా అయ్యారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ.. కరోలిన్ అందాన్ని తెగ పొగిడేశారు. 79 ఏళ్ల ట్రంప్ మాట్లాడుతూ.. 28 ఏళ్ల కరోలిన్ పెదవుల్ని మెషీన్గన్తో పోల్చేశారు. ఆర్థిక ఎజెండా గురించి సభలో ప్రసంగిస్తూ.. అకస్మాత్తుగా తన స్పీచ్‌ను మార్చేశారు. ఈ సభకు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ కూడా వచ్చిందని ట్రంప్ తన అభిమానుల్ని ఉత్తేజపరిచారు. ఆ జోరులోనే కరోలిన్ అందాన్ని ఆకాశానికెత్తేశారు. మన సూపర్‌స్టార్ కూడా ఈ మీటింగ్‌కు వచ్చిందని, నిజంగా ఆమె గ్రేట్ కదా అంటూ పబ్లిక్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.
గతంలోనూ కరోలిన్ అందాలను పొగిడిన ట్రంప్ ఈసారి కూడా తనదైన స్టయిల్లో పంచ్‌లు వేశారు. ఆమె భౌతిక అందాన్ని తెగ కీర్తించారు. టీవీ ఛానళ్లకు వెళ్లినప్పుడు కరోలిన్ తన వాదనలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని, ఆమె అందమైన ముఖం, ఆమె అందమైన పెదవులు .. మెషీన్గన్లా ఉన్నాయని ట్రంప్ అన్నారు. కరోలిన్ నిర్భయంగా వాదిస్తుందని, ఎందుకంటే మన విధానాలను ఆమె సూటిగా చెప్పేస్తుందన్నారు. ఆగస్టులో న్యూస్‌మ్యాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరోలిన్ బ్యూటీపై టెప్టింగ్ రీతిలో ట్రంప్ మాట్లాడేశారు. అదే ఆ ముఖం.. ఆదే ఆ బ్రెయిన్.. అవే ఆ పెదవులు.. వాటి కదలికలు.. అవి మెషీన్గన్లా కదులుతాయని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంతకన్నా ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఇంకెవరికి ఉంటుందని తెలిపారు.
ట్రంప్ మొదటి పాలన సమయంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు లివియట్ పనిచేశారు. న్యూహ్యాంప్‌షైర్‌కు చెందిన ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిక్కోను పెళ్లాడింది. ఎన్నికల్లో ఓడిన ఆమె మళ్లీ జనవరిలో వైట్‌హౌజ్‌లో ప్రెస్ కార్యదర్శిగా చేరింది.
Trump praised Karoline Leavitt: ‘When she goes on FOX, she dominates her lips go bop bop bop like a little machine gun, and she fears nothing because we have the right policy.’ pic.twitter.com/3rzHAWBAdP
— 🇺🇸RA🇺🇸 (@RanaAmjad583030) December 10, 2025