టొరంటో, ఆగస్టు 7: కెనడాలోని సర్రేలో భారత కమెడియన్ కపిల్‌శర్మకు చెందిన కేఫ్‌పై గురువారం మరోసారి దాడి జరిగింది. కొందరు దుండగులు ఆయన కేఫ్‌పై కాల్పులు జరిపారు. కపిల్ శర్మ కేఫ్‌పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి.
జూలై 8న కూడా ఆయన కేఫ్‌పై దుండగులు ఇలాగే కాల్పులు జరిపారు. అయితే రెండు ఘటనల్లోనూ ఎవరూ గాయపడ లేదు. ఈ కాల్పులకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, గోల్డీ థిల్లాన్ గ్యాంగ్‌లు సామాజిక మాధ్యమంలో ప్రకటించాయి.