Kamala Harris | న్యూయార్క్, సెప్టెంబర్ 5: అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రాడామస్‌గా పేరొందిన ఎన్నికల విశ్లేషకుడు అలన్ లిచట్మన్ ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిసే వైట్‌హౌస్ పీఠాన్ని దక్కించుకుంటారంటూ ఆయన జోస్యం చెప్పారు. ‘అగ్రరాజ్య కాబోయే అధ్యక్షురాలు హారిస్’ అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ పోటీలో ఉన్నారు. కాగా ‘కీస్ టు వైట్ హౌస్’ విధానంలో అధ్యక్షుడు ఎవరో గత 40 ఏండ్లుగా ఆయన కచ్చితంగా జోస్యం చెబుతూ వస్తున్నారు.