Kamala Harris | వాషింగ్టన్, జూలై 27: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ నేత కమలా హారిస్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన దస్ర్తాలపై శనివారం ఆమె సంతకాలు చేశారు.
ఈ మేరకు కమలా హారిస్ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. అయితే డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థిగా ఆమె పేరును పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ప్రతి ఒక్కరి ఓటు పొందేందుకు కృషి చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై తప్పకుండా విజయం సాధిస్తానని కమలా హారిస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఇతర డెమొక్రాట్లు ఎవరూ ప్రకటించలేదు.