K P Sharma Oli – Nepal | నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి నియమితులయ్యారు. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పేందుకు కేపీ శర్మ ఓలీ సారధ్యంలో మరో సంకీర్ణ సర్కార్ కొలువు దీరనున్నది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులు కావడం ఇది మూడోసారి. ప్రధానిగా శుక్రవారం ప్రజాప్రతినిధుల సభ విశ్వాసాన్ని నేపాల్ మావోయిస్టు పార్టీ నేత పుష్ప కమాల్ దహల్ ప్రచండ కోల్పోయారు. దీంతో నేపాల్ రాజ్యాంగంలోని 76 (2) అధికరణం ప్రకారం కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి కేపీ శర్మ ఓలీ సారధ్యం వహిస్తారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ -యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్సీ) పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. కేపీ శర్మను తదుపరి ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు.
కేపీ శర్మ ఓలీతోపాటు కొత్త క్యాబినెట్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానిగా ప్రచండ.. పార్లమెంట్ విశ్వాసం కోల్పోయిన తర్వాత నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దౌబా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కు లేఖ సమర్పించారు. 165 మంది సభ్యులు గల నేపాల్ పార్లమెంటులో సీపీఎన్-యూఎంఎల్ పార్టీకి 77 మంది, నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 88 మంది సభ్యులు ఉన్నారు. కేపీ శర్మ ఓలీ ఇంతకు ముందు 2015 అక్టోబర్ 11 నుంచి 2016 ఆగస్టు మూడో తేదీ వరకూ, 2018 ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 2021 జూలై 13 వరకూ నేపాల్ ప్రధానిగా పని చేశారు.
Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
CRISIL- Crude Oil | క్రూడ్ ధరతో ప్రభుత్వ ఖజానాపై ద్రవ్యలోటు భారం తప్పదా.. క్రిసిల్ ఆందోళన