Justin Trudeau | ప్రియురాలితో కలిసి జపాన్‌లో విహరిస్తున్న మాజీ ప్రధాని ట్రూడో.. ఫొటో వైరల్
Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ (Katy Perry)తో డేటింగ్లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ (Katy Perry)తో డేటింగ్లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా ఈ జంట జపాన్ (Japan)లో విహరిస్తోంది.
కేటీ పెర్రీతో కలిసి ట్రూడో జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ మాజీ ప్రధాని ప్యుమియో కిషిదా (Fumio Kishida)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రూడో జంటకు కిషిదా ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కిషిదా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ట్రూడో తన భాగస్వామి పెర్రీతో కలిసి జపాన్‌కు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీ (Sophie Gregoire)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు. మరోవైపు జనవరి 2025లో ప్రధానమంత్రి పదవికి ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
Also Read..
Anil Ambani | అనిల్ అంబానీకి మరో షాక్.. రూ.1,120 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

