వాషింగ్టన్ : అమెరికాలోని సంస్థలలో విదేశీ నిపుణుల నియామకం కోసం అగ్రరాజ్యం ప్రతి ఏడాది కేటాయించే హెచ్-1బీ వీసాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల క్రమంలో ఈ నియామక పద్ధతుల పరిశీలనకు ఆ దేశ న్యాయ శాఖ (డీఓజే) తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
కార్మికుల, ఉద్యోగాల నియామకంలో విదేశీ వీసా హోల్డర్లకు అనుకూలంగా అమెరికా పౌరులను అన్యాయంగా నిర్లక్ష్యం చేసిన సందర్భాలను నివేదించాలని యజమానులను కోరింది. డీవోజేలో అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్గా ఉన్న భారత సంతతికి చెందిన హర్మీత్ ధిల్లాన్ ఈ దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్నారు.