Joe Biden | మహిళా అధికారిణిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం.. ఏడాదిలో 11వ ఘటన
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పెంపుడు శునకం ‘కమాండర్’ (Commander) అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. తాజాగా యూనిఫార్మ్డ్ విభాగంలోని మహిళా అధికారిణిని కరిచింది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పెంపుడు శునకం ‘కమాండర్’ (Commander) అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. తాజాగా యూనిఫార్మ్డ్ విభాగంలోని మహిళా అధికారిణిని కరిచింది. ప్రస్తుతం ఆమె శ్వేతసౌధానికి చెందిన మెడికల్ యూనిట్లో చికిత్స తీసుకుంటోంది. రక్షణ సిబ్బందిని కమాండర్ కరవడం ఈ ఏడాదిలో ఇది 11వ ఘటన కావడం గమనార్హం.
కాగా, బైడెన్‌కు చెందిన కమాండర్ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కనీసం పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం (White House)కూడా అంగీకరించింది. కమాండర్ దాడిలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ కమాండర్ శునకం.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందినదిగా తెలిపింది. ఈ శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారట. అయితే, అంతకుముందు మేజర్ అనే శునకం కూడా బైడెన్ వద్ద ఉండేదని.. అది కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరుస్తుండటంతో దాన్ని అధ్యక్షుడు తన మిత్రుల వద్దకు పంపించేసినట్లు వెల్లడించింది.
Also Read..
Manipur Violence | మణిపూర్‌లో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన.. పలువురికి గాయాలు
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Mahindra | ఆ కారులో అందుకే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదు.. యూపీ ఘటనపై స్పందించిన మహీంద్రా సంస్థ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

