అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనకు బయలుదేరారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మధ్యప్రాచ్య దేశాల పర్యటనకు వచ్చిన బైడెన్.. బుధవారం నాడు ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన బైడెన్.. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ కలిసేందుకు పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ స్వాగతం పలికారు. అలాగే తను తొలిసారిగా 1973లో ఇజ్రాయెల్ వచ్చానని, ఇక్కడకు రావడం ఇది తనకు పదోసారని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-యూఎస్ మధ్య చాలా బలమైన బంధం ఉందన్నారు.