రష్యాపై పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులపై పలు దేశాలు బ్యాన్ విధించాయి.
ఇప్పుడు తాజాగా రష్యా నుంచి ఎగుమతి అయ్యే బంగారం మీద కూడా నిషేధం విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. జీ7 సభ్యదేశాలు ఈ విషయాన్ని ప్రకటిస్తామని బైడెన్ చెప్పారు.
‘‘ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి అవసరమైన నిధులు సమకూర్చుకోకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా చరిత్రలో లేని విధంగా ఆంక్షలు విధించింది’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రష్యా బంగారంపై కూడా బ్యాన్ విధించే నిర్ణయాన్ని జీ7 దేశాలు ప్రకటిస్తాయని పేర్కొన్నారు.