తజకిస్తాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ రెండు రోజుల క్రితం తన ట్రుత్ సోషల్ అకౌంట్లో వివాదాస్పద ఫోటో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఏసు క్రీస్తు ఫోజులో ఉన్న ఓ ఏఐ ఫోటోను ఆయన పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ పిక్‌ను ఆయన డిలీట్ చేశారు. ఓ వైద్యుడిలా చికిత్స చేస్తున్నానన్న ఉద్దేశంతో ఆ ఫోటో పోస్టు చేసినట్లు చెప్పారు. అయితే ఆ ఫోటోకు కౌంటర్‌గా ఇరానీ ఎంబసీ(Iran Embassy) ఓ వీడియోను రిలీజ్ చేసింది. తజకిస్తాన్‌లోని ఆ ఎంబసీ ఏఐతో చేసిన ఆ వీడియోను తన అకౌంట్లో షేర్ చేసింది. నీ పాపం పండిదన్న స్వరం ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతుంది. ఆ తర్వాత వెనుక నుంచి జీసెస్ వచ్చి ట్రంప్‌కు గట్టిగా పంచ్ ఇస్తారు. ఆ పంచ్ పవర్‌కు ట్రంప్ అగాధంలోని అగ్గిమంటల్లో పడిపోతారు. ఆ వీడియో ఇదే.
— Iran Embassy in Tajikistan (@IRANinTJ) April 14, 2026
మరో వైపు క్రైస్తవ మతపెద్ద పోప్ లియో-14పై మళ్లీ తన బాణాన్ని ఎక్కుపెట్టారు ట్రంప్. ఇరాన్ వార్ అంశంలో ట్రంప్, పోప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు నెలల్లో ఇరాన్ సుమారు 42 వేల మంది అమాయక నిరసనకారుల్ని చంపిన విషయాన్ని ఎవరైనా పోప్‌కు చెబుతారా అని అన్నారు. ఇరాన్ అణు బాంబును కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం అంటే తనకు భయం లేదని పోప్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ట్రంప్ మరో పోస్టులో మళ్లీ నాటోను విమర్శించారు. ఇరాన్‌పై వార్‌లో నాటో మనతో కలిసి రాలేదని, భవిష్యత్తులో కూడా వాళ్లు మనతో కలిసిరారు అని ఆయన అన్నారు.