e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home అంతర్జాతీయం ప్ర‌పంచ కుబేరుడిని వ‌దిలి స్కూల్ టీచ‌ర్‌ను పెళ్లి చేసుకుంది!

ప్ర‌పంచ కుబేరుడిని వ‌దిలి స్కూల్ టీచ‌ర్‌ను పెళ్లి చేసుకుంది!

ప్ర‌పంచ కుబేరుడిని వ‌దిలి స్కూల్ టీచ‌ర్‌ను పెళ్లి చేసుకుంది!

న్యూయార్క్‌: అమెజాన్ ఫౌండ‌ర్‌, ప్ర‌పంచ కుబేరుల్లో ప్ర‌స్తుతం రెండోస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మ‌రో పెళ్లి చేసుకుంది. స్కాట్ రెండో భ‌ర్త డాన్ జెవెట్ సీటెల్‌లో ఓ సైన్స్ టీచ‌ర్ కావ‌డం విశేషం. ఈ పెళ్లి విష‌యాన్ని డానే వెల్ల‌డించాడు. గివింగ్ ప్లెడ్జ్ అనే వెబ్‌పేజ్ ద్వారా డాన్ ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. నాకు తెలిసిన అత్యంత ద‌య‌గ‌ల, దాతృత్వం క‌లిగిన మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్నాను అని డాన్ చెప్పాడు. మెకంజీ స్కాట్ ప్ర‌పంచంలోని కుబేరుల జాబితాలో 5300 కోట్ల డాల‌ర్ల‌తో 22వ స్థానంలో ఉంది.
విడాకుల త‌ర్వాత భ‌ర‌ణం రూపంలో జెఫ్ బెజోస్ నుంచి భారీ మొత్తం అందుకున్న మెకంజీ స్కాట్‌.. అందులో స‌గ భాగాన్ని వివిధ చారిటీల‌కు విరాళాలుగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. 2019లో ఈ మేర‌కు గివింగ్ ప్లెడ్జ్‌లో సంత‌కం కూడా చేసింది. మెకంజీ స్కాట్ పిల్ల‌లు వెళ్లే లేక్‌సైడ్ స్కూల్లోనే డాన్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డ డాన్ కెమెస్ట్రీ టీచ‌ర్‌గా ప‌ని చేసేవాడు. 2019లో జెఫ్ బెజోస్‌తో త‌న 25 ఏళ్ల వైవాహిక బంధానికి మెకంజీ స్కాట్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా బెజోస్ ఇచ్చిన మొత్తంతోనే ఆమె ప్ర‌పంచ కుబేరుల జాబితాలో నిలిచేలా చేసింది.

Advertisement
ప్ర‌పంచ కుబేరుడిని వ‌దిలి స్కూల్ టీచ‌ర్‌ను పెళ్లి చేసుకుంది!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement