JD Vance | మా ఉత్పత్తులు కొంటే విదేశాల్లోని ఇరాన్ ఆస్తులు విడిపిస్తాం : జేడీ వాన్స్
JD Vance | పశ్చిమాసియా (West Asia) లో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడిందని అమెరికా ఉపాధ్యక్షుడు (USA Vice President) జేడీ వాన్స్ (JD Vance) అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకడమే లక్ష్యంగా ఆ దేశంతో జరిపిన చర్చలు తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని చెప్పారు.
JD Vance : పశ్చిమాసియా (West Asia) లో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడిందని అమెరికా ఉపాధ్యక్షుడు (USA Vice President) జేడీ వాన్స్ (JD Vance) అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకడమే లక్ష్యంగా ఆ దేశంతో జరిపిన చర్చలు తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని చెప్పారు. దీనివల్ల అమెరికా ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ సోయా, మొక్కజొన్న, గోధుమలను టెహ్రాన్ కొనుగోలు చేస్తే దానికి బదులుగా విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు విడిపిస్తామని పేర్కొన్నారు.
తాము చేసుకున్న ప్రాథమిక ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉందో లేదో ధ్రువీకరించడానికి ఐక్యరాజ్యసమితి అణు తనిఖీ అధికారులు ఇరాన్ను సందర్శిస్తారని వాన్స్ తెలిపారు. లెబనాన్ విషయంలో సరైన సమన్వయం ఉండేలా ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో తమ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ తెరిచే ఉందని, జలసంధి మీదుగా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అన్నారు.
పాక్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు అవగాహన ఒప్పందంలో ముందడుగు వేశాయని ఇరాన్ (Iran) అధికారులు వెల్లడించారు. పాక్ నేతలు లేకపోతే ఒప్పందం ముందుకు సాగడం కష్టతరంగా మారేదని, మళ్లీ ఘర్షణలు తలెత్తేవని పేర్కొన్నారు. రాబోయే 60 రోజుల్లో ఒక సమగ్ర ఒప్పందానికి ఎలా చేరుకోవాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. చర్చల ద్వారానే దౌత్యపరమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

