టోక్యో, ఫిబ్రవరి 27: జపాన్లో రికార్డు స్థాయికి జననాల రేటు పడిపోయింది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా తగ్గుదల నమోదైంది. ఒక వైపు పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, మరో వైపు తగ్గుతున్న జననాల పట్ల ఆందోళన చెందుతున్న జపాన్ ఎన్నో చర్యలు చేపట్టినా ఫలితాలను ఇవ్వడం లేదు.
2024లో 7,20,998 మంది శిశువులు జన్మించారు. మునుపటి ఏడాదితో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల అని ఆ దేశ ఆరోగ్య, సంక్షేమ శాఖ ప్రకటించింది. 1899 తర్వాత ఇంత తక్కువగా జననాలు నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఏడాది జపాన్లో 4,99,999 పెండ్లిండ్లు నమోదయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2070 నాటికి జపాన్ జనాభా 30 శాతం తగ్గుతుంది.