టోక్యో : ‘తడిచెత్త, పొడిచెత్తను వేరు చేయండి’ అని ఎంతగా చెప్తున్నా వినని ప్రజల పట్ల జపాన్లోని ఫుకుషిమా నగరం వినూత్న నిర్ణయం తీసుకుంది. చెత్త వేరు చేయని వారి పేర్లను బహిర్గతపర్చాలని నిర్ణయించింది. మంగళవారం తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఏడాది మార్చి నుంచి అమలులోకి రానున్నది. జపాన్లో చెత్త వేయడానికి, వేరు చేయడానికి సంబంధించి కూడా నిబంధనలు అమలులో ఉన్నాయి. అయితే, ఫుకుషిమా మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు ఈ నిబంధనలు పాటించకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ఇక కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించింది. నిబంధనలు పాటించని ఉల్లంఘనుల పేర్లను తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది.