Lunar mission | జపాన్ లూనార్ మిషన్ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన హెచ్-2ఏ రాకెట్
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ (Japan) ప్రయోగించింది. గురువారం ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్ (Tanegashima Space Center) ఉన్న యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
టోక్యో: జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ (Japan) ప్రయోగించింది. గురువారం ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్ (Tanegashima Space Center) ఉన్న యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మూన్ స్నిపర్ (Moon Sniper) ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుని ఉపరితలాన్ని తాకిన ఐదో దేశంగా జపాన్ చరిత్ర సృష్టించనుంది. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్ మూన్ స్నిపర్ మిషన్ (Moon Sniper Mission) మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA), నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన పరిశోధన ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని దక్షిణ జపాన్‌లోని తనేగషిమా నుంచి ఆన్లైన్లో 35 వేల మందికి ప్రత్యక్షంగా తిలకించారు. షెడ్యూల్ ప్రకారం గత నెల 28న హెచ్-2ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

