షికాగో: అమెరికాలోని షికాగోలో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన నిర్దోషికి దాదాపు రూ.420 కోట్ల పరిహారం దక్కనుంది. 2008లో షికాగోలోని ఓ పార్కు వద్ద జరిగిన కాల్పుల్లో 19 ఏండ్ల యువకుడు మరణించాడు.
కాల్పులకు పాల్పడింది మార్సెల్ బ్రౌన్(అప్పుడు వయసు 18) అని పోలీసులు నేరారోపణలు చేశారు. దీంతో కోర్టు బ్రౌన్కు 35 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఈ నేరానికి పాల్పడింది బ్రౌన్ కాదని తర్వాత తేలింది. దీంతో పదేండ్ల పాటు శిక్షను అనుభవించిన తర్వాత 2018లో ఆయన జైలు శిక్షను కోర్టు రద్దు చేసింది.