గురువారం 28 మే 2020
International - May 16, 2020 , 13:55:46

ఇట‌లీలో ప్ర‌యాణ ఆంక్ష‌లు ఎత్తివేత‌..

ఇట‌లీలో ప్ర‌యాణ ఆంక్ష‌లు ఎత్తివేత‌..


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌తో ఇట‌లీ అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే.  అయితే మెల్ల‌మెల్ల‌గా ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న ఆ ప్ర‌భుత్వం.. ఇప్పుడు ప్ర‌యాణాల‌పై ఉన్న నిబంధ‌న‌ల‌ను కూడా స‌డ‌లిస్తున్న‌ది.  జూన్ 3వ తేదీ నుంచి ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను సంపూర్ణంగా ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  దేశం నుంచి ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌చ్చు లేదా బ‌య‌టి నుంచి దేశంలోకి ఎవ‌రైనా రావొచ్చు. దాదాపు రెండు నెల‌లు పూర్తి స్థాయిలో ఇట‌లీ స్తంభించిపోయింది.  ఆ దేశంలో వైర‌స్ మృతుల సంఖ్య కూడా అత్య‌ధికంగానే ఉన్న‌ది. ప్ర‌స్తుతానికి ఇన్‌ఫెక్ష‌న్ రేటు తగ్గింది. ఇటలీలో ఇప్ప‌టి వ‌ర‌కు 31600 మంది చ‌నిపోయారు. అమెరికా, బ్రిట‌న్ త‌ర్వాత అత్య‌ధికంగా చ‌నిపోయింది ఇట‌లీలోనే.  


logo