క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ పార్నెల్ ఓ ప్రయోగం ప్రారంభించి 94 ఏండ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతున్నది. పిచ్ అనే ఒక ప్రత్యేక ద్రవాన్ని గరాటులో బోర్లించడమే ఈ ప్రయోగం. ఇది ఘనరూపంలో ఉన్నట్టు కనిపించే ద్రవ పదార్థం.
ఇది నీటి కంటే 100 బిలియన్ రెట్లు, తేనె కంటే 20 లక్షల రెట్లు జిగటగా ఉంటుంది. ఈ ద్రవాన్ని వేడి చేసి చల్లార్చిన తర్వాత 1930లో ఒక గరాటులోకి బోర్లించారు. అయితే, దీని జిగట స్వభావం కారణంగా ఒక్కో చుక్క గరాటులో పడటానికి ఏండ్లు పడుతున్నది. 94 ఏండ్లలో 9 చుక్కలు మాత్రమే పడ్డాయి.