ఇస్తాంబుల్ : ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమమొగ్లును అరెస్ట్ చేయాలని టర్కిష్ కోర్టు ఆదివారం ఆదేశించింది. అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను జైలులోనే నిర్బంధించాలని తెలిపింది. ఆయన టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ప్రధాన ప్రత్యర్థి. ఎక్రెమ్ అరెస్టుతో టర్కీలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పదేళ్లలో ఇంత తీవ్ర నిరసన వ్యక్తం కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తున్నది. అంతేకాకుండా, టర్కీలో ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. 2028లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ప్రత్యర్థిని తప్పించడం కోసమే ఎక్రెమ్ను జైలుపాలు చేశారని విమర్శలు వస్తున్నాయి.