జెరూసలేం: హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి మొదటిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు జరిపిన బాంబుదాడుల్లో 21 మంది సైనికులు, మరో చోట జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఐడీఎఫ్ అధికారులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం మీడియాకు తెలిపింది.
దక్షిణ గాజాలోని కీలకమైన ఖాన్ యూనస్ నగరంలో సోమవారం ఇజ్రాయెల్ బలగాలు చేపట్టిన బాంబు దాడుల్లో కనీసం 50 మంది పాలస్తీనియన్లు చనిపోయారని సమాచారం.