Benjamin Netanyahu | అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హామాస్ విజయం సాధించేవరకు యుద్ధ ఆగదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పష్టం చేశారు.
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై (Gaza) భూతల దాడులను తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్‌లోని (Israel) నగరాలపై హమాస్ (Hamas) రాకెట్ దాడులకు పాల్పడుతున్నది. ఇరుపక్షాల దాడులు ప్రతిదాడులతో భారీసంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ముట్టడించడంతో గాజాలోని ప్రజలు కనీసం తాగడానికి నీరు కూడా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని (Ceasefire) ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హామాస్ విజయం సాధించేవరకు యుద్ధ ఆగదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు (Surrender) అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించడంలో ప్రపంచ దేశాలు తమకు సాహాయం చేయాలని కోరారు.
అక్టోబర్ 7 నాటి హామాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల, గగణ తల దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఇప్పటిరకు గాజాలో 8300 మంది మరణించారని హమాస్ ప్రకటించింది. కాగా, హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారని, 230కిపైగా మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహూ వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

