జెరుసలాం: మూడు నెలల క్రితం జరిగిన దాడిలో ముగ్గురు హమాస్ సీనియర్ నేతలు మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ (Israeli military)ఇవాళ పేర్కొన్నది. గాజాలో జరుగుతున్న పోరులో గత ఏడాది నుంచి పాలస్తీనా ఆపరేటివ్స్‌తో ఇజ్రాయిల్ యుద్ధం సాగిస్తున్నది. వైమానిక దాడిలో హమాస్ ప్రభుత్వ నేత రాహి ముష్తాహ ప్రాణాలు కోల్పోయినట్లు మిలిటరీ తెలిపింది. హమాస్ పొలిటికల్ బ్యూరోలో సెక్యూర్టీ హోదాలో ఉన్న సమేహ్ అల్ సిరాజ్ కూడామృతిచెందినట్లుతెలిపారు. కమాండర్ సామి ఖుదె కూడా ఆ దాడుల్లో మృతిచెందాడు. హమాస్‌లో ముష్తాహ్ .. సీనియర్ ఆపరేటివ్‌గా ఉన్నాడు. హమాస్ ఫోర్స్‌కు చెందిన నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. హమాస్ టాప్ లీడర్ యాహ సిన్వార్‌కు రైట్ హ్యాండ్‌గా ముష్తాహ్ను గుర్తించారు. 2015 నుంచి ముష్తాహ్ను గ్లోబల్ ఉగ్రవాదిగా అమెరికా పరిగణించింది. హమాస్ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా సిరాజ్, అంతర్గత సెక్యూర్టీ ఏజెన్సీ నేతగా ఓదేహ్ ఉన్నట్లు ఈసీఎఫ్ఆర్ పేర్కొన్నది.