Israeli-Hamas War | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) దాడులను మరింత ముమ్మరం చేసింది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో హమాస్ సొరంగాలపై భీకరదాడులు జరిపినట్లు ఓ నివేదిక పేర్కొంది. దాడులతో 24గంటల్లోనే 200 మంది మరణించారు.
దక్షిణ నగరంలో నిరంతరం ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సైనికులు హమాస్ సొరంగాలపై వైమానిక దాడులు జరిపారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిప్పై ఇజ్రాయెల్ ట్యాంకులతో పాటు విమానాలను దాడులు చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో ఇజ్రాయెల్ ప్రచారంలో దాదాపు 200 మంది మరణించినట్లు తెలుస్తున్నది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శిబిరంపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసిందని పాలస్తీనియన్ మెడిక్స్ పేర్కొంది.