Israeli Airstrikes | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లకుండానే మధ్యప్రాచ్య పర్యటనను ముగించిన తర్వాత ఐడీఎఫ్ తమ దాడులకు మరింత తీవ్రతరం చేసింది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. సోమవారం రాత్రి కూడా ఉత్తర గాజా, డీర్ ఆల్ బలా, ఖాన్ యూనిస్ ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను కొనసాగించాయి.
ఈ దాడుల్లో దాదాపు 60 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు (Palestinian Health Officials) వెల్లడించారు. ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది, డీర్ ఆల్ బలాపై జరిపిన దాడిలో 13 మంది, సమీపంలోని నుసెయిరాత్ శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో 15 మంది, దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌లో జరిగిన రెండు దాడుల్లో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. హమాస్‌ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి. మరోవైపు గాజా పోరు మొదలైనప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియుల సంఖ్య 55 వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. లక్షలాది మంది గాయపడ్డట్లు వెల్లడించింది.
మిగిలిన బందీలను విడుదల చేసేలా హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు గాజాలో విస్త్రృత గ్రౌండ్ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లకుండానే మధ్యప్రాచ్య పర్యటనను ముగించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి గాజాలో 3 వేల మందికిపైగా మరణించారు.
గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం : ఇజ్రాయెల్ ప్రధాని
గాజాస్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తెలిపారు. సోమవారం ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. గాజాస్ట్రిప్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇజ్రాయిల్ వెనుకడుగు వేయబోదన్నారు. గాజాస్ట్రిప్ వద్ద భీకర పోరు సాగుతోందని, దాంట్లో ప్రగతి సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. గాజాస్ట్రిప్ ఏరియాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. విజయం సాధించాలంటే ఆ దిశగానే ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుందన్నారు.
Also Read..
“Benjamin Netanyahu: గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం : ఇజ్రాయిల్ ప్రధాని”
“Israel Strikes | గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 103 మంది మృతి”
“Israeli bombs | గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ బాంబు దాడులు.. 125 మంది మృతి”