Israel vs Iran | ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్ బలగాల ప్రకటన
Israel vs Iran | ఇరాన్ (Iran) దేశం నుంచి అణు ముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్ (Israel) సాయుధ దళాలు (IDF) తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్‌ఫోర్స్ ఇరాన్‌లోని 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు.
Israel vs Iran : ఇరాన్ (Iran) దేశం నుంచి అణు ముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్ (Israel) సాయుధ దళాలు (IDF) తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్‌ఫోర్స్ ఇరాన్‌లోని 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు.
‘మేం ఒక పద్ధతి ప్రకారం ఇరాన్‌లోని అణుముప్పును నాశనం చేస్తున్నాం. మా దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి’ అని డెఫ్రిన్ పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్ దళాలు షేర్ చేశాయి.
కాగా ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గత శుక్రవారం నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా పట్టు సాధించినట్లు చెబుతున్నాయి. ఇప్పటివరకు 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇదిలావుంటే ఇజ్రాయెల్‌కు చెందిన ఓ భారీ డ్రోన్‌ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. తమ మానవరహిత విమానాన్ని ఇరాన్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని వాడి ధ్వంసం చేసిందని పేర్కొంది.
Read More >>
72 గంటలు గడిచినా ఇంకా కేరళలోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!
రాజా హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారం..!
అమ్మ, అంకుల్ కలిసి నాన్నను చంపుతుంటే చూశా.. పోలీసులతో తొమ్మిదేళ్ల బాలుడు..!
ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై చెట్టుకు ఉరేసి..!
హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. సోనమ్‌కు 119 కాల్స్ చేసిన సంజయ్ వర్మ..!
తమిళనాడు ఏడీజీపీ సస్పెన్షన్.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

