Israel | అక్టోబర్ 27న ఇజ్రాయేల్‌లో ఎన్నికలు.. నెతన్యాహు ప్రభుత్వానికి ఆఖరి రోజు అదే..!
Israel : పశ్చిమాసియాలో యుద్ధం, అస్థిర పరిస్థితులు కొనసాగుతుండగానే ఇజ్రాయేల్(Israel)లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ ఏడాది అక్టోబర్ 27న ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Israel : పశ్చిమాసియాలో యుద్ధం, అస్థిర పరిస్థితులు కొనసాగుతుండగానే ఇజ్రాయేల్(Israel)లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ ఏడాది అక్టోబర్ 27న ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్ ప్రభుత్వం నాలుగేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్నందున ఎలక్షన్లకు సమయం వచ్చిందని ఆదివారం ఇజ్రాయేల్ మీడియా తెలిపింది. నెతన్యాహు ప్రభుత్వం జూలై 17 వరకే కొనసాగనుంది.
ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం మరో నాలుగు రోజులే ఉండనుంది. దాంతో, అధికార లీకుడ్ పార్టీ సీనియర్ నాయకుడు అఫిర్ కట్జ్ టైమ్స్ ఇజ్రాయేల్ వార్త సంస్థతో మాట్లాడుతూ.. అక్టోబర్ 27న ఎన్నికలు ఉంటాయని వెల్లడించాయి. 1988 తర్వాత షెడ్యూల్ ప్రకారం నాలుగేళ్లకు జరుగనున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. అంతేకాదు గత 50 ఏళ్లలో పూర్తికాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వంగా బెంజమిన్ నెతన్యాహు సర్కార్ గుర్తింపు సాధించనుంది.
🇮🇱 Israel will hold parliamentary elections on October 27.
The vote will be the country’s first election to take place on its originally scheduled date in 38 years.
Follow: @europa pic.twitter.com/6syKFx0YWa
— Europa.com (@europa) July 12, 2026
జూలై 17 నుంచే
జూలై 17 నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సెప్టెంబర్ 7 కల్లా సిద్ధం కానుందని ఇజ్రాయేల్ మీడియా పేర్కొంది. 120 ఎంపీ స్థానాలకు 61 సీట్లు గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే.. నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్ పార్టీకి, గడి ఐసెన్‌కోట్ సారథ్యంలోని యషార్ పార్టీకి ఎన్నికల్లో తలా 23 సీట్లు వస్తాయని ఓ మీడియా సంస్థ అంచనా వేసింది. మరో సంస్థ మాత్రం ఐసెన్‌కోట్ పార్టీకి సంపూర్ణ ఆధిపత్యం లభిస్తుందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

