జెరూసలెం, జూలై 12: ఓ వైపు యుద్ధాలు చేస్తూ.. మరోవైపు ఓటర్లను ఎదుర్కొనేందుకు నెతన్యాహు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇజ్రాయెల్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్ 27న జరుగుతాయని అధికార ‘లికుడ్’ పార్టీ కీలక సభ్యుడు ఒఫిర్ కట్జ్ ఆదివారం ప్రకటించారు. ఆ దేశంలో 1988 తర్వాత నిర్ణీత సమయంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే కావటం గమనార్హం.
అంతేగాక గత 50 ఏండ్లలో నాలుగేండ్లు పాలించిన సర్కార్‌గా నెతన్యాహు ప్రభుత్వం నిలిచింది. 120 మంది సభ్యులున్న పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఒక పార్టీకి 61 సీట్లు అవసరం. గత బుధవారం చానల్ 13 ప్రచురించిన పోల్ ప్రకారం, ఈసారి నెతన్యాహు నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి ఓటమి ఖాయమని అంచనావేసింది.