టెల్ అవీవ్: పశ్చిమాసియా యుద్ధంలోకి యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ రంగప్రవేశం చేశారు. ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ అధికార ప్రతినిధి నాదవ్ షోష్ని స్పందిస్తూ బహుముఖ యుద్ధానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. ‘గత రెండున్నరేండ్లుగా మేము బహుముఖ యుద్ధంలోనే ఉన్నాం. పలు వైపుల నుంచి వస్తున్న శత్రువుల దాడులను, బెదిరింపులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం’ అని ఆయన అన్నారు. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్‌పైకి హౌతీలు రెండు క్షిపణులతో దాడి చేసిన విషయాన్ని ఆ దేశ అధికారులు నిర్ధారించారు. అయితే వాటిని తాము విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు.