జెరుసలాం: లెబనాన్‌తో నేరుగా చర్చలు నిర్వహించేందుకు ఇజ్రాయెల్(Israel) సిద్దమైంది. వీలైనంత త్వరలో లెబనాన్‌తో శాంతి చర్చలు జరగనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఇరాన్‌పై దాడిని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటిన నేపథ్యంలో.. ఇస్లామాబాద్‌లో జరిగే శాంతి చర్చల దృష్ట్యా.. ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌తో ప్రత్యక్షంగా చర్చలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నామని, చర్చల అంశంలో తమ క్యాబినెట్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొన్నది.
హిజ్బుల్లాను నియంత్రించే అంశంపై చర్చలు ఉంటాయని, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని, బీరట్ నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించే అంశంపై లెబనాన్ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇజ్రాయెల్ పీఎంవో తెలిపింది. లెబనాన్‌తో చర్చలు జరిపినా.. హిజ్బుల్లాతో సీజ్ఫైర్ ఉండదని ఓ ఇజ్రాయెలీ అధికారి తెలిపారు. వచ్చే వారం వాషింగ్టన్లో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు ఉంటాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధ వాతావరణమే నెలకొన్నది. ఇజ్రాయెల్‌తో చర్చలు నిర్వహించేందుకు లెబనాన్ 24 గంటల పాటు తాత్కాలిక సీజ్ఫైర్ పాటించింది.