సనా: యెమెన్ రాజధాని సనాలోని విద్యుత్తు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ వైపు ఒక క్షిపణి ప్రయోగించిన క్రమంలో దానికి ప్రతీకారంగా ఇరాన్ మద్దతు ఉన్న ఈ గ్రూప్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి జరిపింది.
సనాలోని విద్యుత్తు ప్లాంట్, గ్యాస్ స్టేషన్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని హౌతీ మీడియా తెలిపింది. మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్ ప్యాలస్ సహా పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున పేలుడు శబ్దాలు విన్పించినట్టు స్థానిక పౌరులు తెలిపారు.