Israel attack : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 77 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 45,206కు పెరిగింది.
ఇదిలావుంటే శుక్రవారం సాయంత్రం వెస్ట్ బ్యాంకు ఏరియాలో ఇజ్రాయెల్ దళాలు 25 మందిని అరెస్ట్ చేశాయి. వారిలో ఇద్దరు చిన్నారులు, ఒక ఖైదీ ఉన్నారని ఖైదీల గ్రూప్ తెలిపింది.