టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది. టెహ్రాన్‌లో వందేండ్లనాటి మెడికల్ రిసెర్చ్ సెంటర్‌పై దాడి చేసింది. అలాగే స్టీల్ ప్లాంట్ లక్ష్యంగానూ దాడులు చేసింది. ఇరాన్ స్టీల్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని 70 శాతం మేర నాశనం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. బుషెర్లోని రెడ్ క్రెసెంట్ ఎయిర్ సెంటర్‌పైనా ఇజ్రాయెల్ డ్రోన్లతో విరుచుకుపడింది. మరోవైపు లెబనాన్‌పైనా దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేసింది.
బీరుట్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని మరిన్ని వంతెనలను ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ దళాలు వినాశకరమైన భూతల దండయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో దక్షిణ లెబనాన్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేయడానికి తాము వంతెనలను ధ్వంసం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొన్నది.
శుక్రవారం ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయి అడ్రాయి ఒక పోస్ట్ పెట్టారు. పశ్చిమ బెకా లోయలోని లిటానీ నదిపై ఉన్న సోహ్మోర్, మష్ఘరా వంతెనలను లెబనాన్ సాయుధ సంస్థ హెజ్బొల్లా ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. వాటిపై దాడికి తమ సైన్యం ప్రణాళిక వేసిందని పేర్కొన్నారు.