న్యూఢిల్లీ: వెస్ట్ బ్యాంక్‌లోని అల్ జాయెం అనే గ్రామంలో బందీలుగా ఉన్న 10 మంది భారత్‌కు చెందిన నిర్మాణ కార్మికులను ఇజ్రాయెలీ అధికారులు గురువారం రక్షించారు. ఈ కార్మికులంతా గడచిన నెల రోజులుగా బందీలుగా ఉన్నారని జనాభా, ఇమ్మిగ్రేషన్ సంస్థ పేర్కొంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్), న్యాయ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీరిని రక్షించింది. నిర్మాణ కార్మికులు చట్టబద్ధంగానే ఇజ్రాయెకు వచ్చారని, అయితే ఉపాధి కల్పిస్తామని నమ్మబలికిన అల్ జమీమ్ గ్రామ స్థానికుడు ఒకరు వారి పాస్‌పోర్టులను జప్తు చేసుకున్నాడని వివరించింది.