జెరూసలెం, ఫిబ్రవరి 17: దక్షిణ లెబనాన్‌పై సోమవారం తాము చేసిన డ్రోన్ దాడిలో ఆ దేశ హమాస్ గ్రూప్ అధిపతి మహమ్మద్ షహీన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిగా దక్షిణ లెబనాన్ నుంచి ఉపసంహరించాల్సిన గడువు ముగుస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది.
‘అతడు తాజాగా ఉగ్ర దాడులకు ప్లాన్ చేశాడు. ఇరాన్ ఆదేశాల మేరకు ఆ దేశ నిధులతో లెబనాన్ గడ్డపై నుంచి ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నాడు’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది. ఆన్లైన్లో షేర్ అవుతున్న ఉన్న ఓ వీడియో ప్రకారం ఇజ్రాయెల్ డ్రోన్ దాడి వల్ల ఒక కారు మంటల్లో చిక్కుకుంది. లెబనాన్ సైన్యం తనిఖీ కేంద్రానికి దగ్గర్లో ఈ దాడి జరిగింది.