Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం చేస్తున్నది. ఇప్పటి వరకు 12వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఐక్యరాజ్య సమితి, పాలస్తీనా ప్రభుత్వం గాజా స్ట్రిప్‌లో మానవతా సహాయం అందించేందుకు కాల్పుల విరమణను ప్రకటించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల ఐడీఎఫ్ గాజాలో అల్ షిఫా దవాఖానను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆసుపత్రిలోకి సైన్యం ప్రవేశించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆసుపత్రి, పాఠశాలల్లో హమాస్ కార్యకలాపాలు కొనసాగిస్తుందంటూ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిపెట్టినట్లు పేర్కొంది.
ఈ మేరకు ఆయుధాలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. తాజాగా కిండర్ గార్టెన్లోనూ రాకెట్ లాంచర్లు, మోర్టార్ షెల్స్ ఉన్న ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. ‘కిండర్ గార్టెన్లలో బొమ్మలు భద్రపరచాలి.. మారణాయుధాలు కాదు’ అంటూ ఇజ్రాయెల్ సైన్యం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో ఇరుకైన గది మూలలో మోటార్ షెల్స్ కనిపించారు. మరో పాఠశాలలో రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రిని కనిపించాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో వందలాది మంది ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్నారు. హమాస్ పౌరులను మానవ కవచంగా ఉపయోగించుకుంటోందని, పాఠశాలలు.. ఆసుపత్రుల్లో దాచి పెడుతుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది.
RPGs, mortar shells, and other weapons were found by IDF troops inside a kindergarten and an elementary school in northern Gaza.
Kindergartens should store toys, not deadly weapons. pic.twitter.com/OuPfJmfGYZ
— Israel Defense Forces (@IDF) November 18, 2023