Majid Khademi | ఇరాన్‌కు మరో షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమీ మృతి
Majid Khademi : యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు.
Majid Khademi : యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై సోమవారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో మాజిద్ ఖదేమి మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. కొద్దిసేపటి క్రితం ఐఆర్జీసీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘‘ఐఆర్జీసీలోని ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమి అమరుడయ్యాడు. శతృవులైన అమెరికా-జియోనిస్టులు జరిపిన తీవ్రవాద దాడిలో బలమైన, విద్యావేత్త అయిన మాజిద్ సోమవారం మరణించారు’’ అని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ ఛానెల్లో పేర్కొంది. మాజిద్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు, ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ విభాగానికి కూడా నాయకత్వం వహించాడు. మాజిద్.. ఐఆర్జీసీలో చాలా కాలం నుంచి పని చేస్తున్నాడు. మొదట ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్‌కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత 2025 జూన్‌లో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి అయ్యాడు. అంతకుముందు ఈ విభాగానికి నాయకత్వం వహించిన మొహమ్మద్ ఖజేమి.. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమయ్యాడు. దీంతో ఆయన స్థానంలో ఖదేమి బాధ్యతలు స్వీకరించాడు.
ఇరాన్‌కు సంబంధించి కీలక విభాగాల్లో ఉన్న అగ్ర నేతల్లో మాజిద్ చివరివాడు అయినట్లు తెలుస్తోంది. అంటే.. తాజా యుద్ధంలో ఇరాన్‌కు చెందిన సీనియర్ అగ్రనేతలు అందరూ మరణించినట్లే. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేని సహా అలీ లారిజాని, ఎస్మాయిల్ ఖతిబ్, మొహమ్మద్ పాక్పోర్, గోలాంరెజా వంటి నేతలు మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య చర్చల్లో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రతిపాదనల్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు.. ఇరాన్, అమెరికాకు అందించాయి. వీటిపై ఆయా దేశాలు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాల్పుల విరమణ ఉండొచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

