టెహ్రాన్, డిసెంబర్ 17: ఇస్లామిక్ డ్రెస్ కోడ్ను పాటించని మహిళలను శిక్షించడానికి ఉద్దేశించిన వివాదాస్పద హిజాబ్ చట్టం అమలును ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు చెందిన సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశీయంగా, అంత ర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయా న్ని తీసుకుంది.
ఈ కొత్త చట్టంపై గతంలో మానవ హక్కుల సంఘా లు ఆగ్ర హం వ్యక్తం చేశాయి. దీన్ని క్రూర మైన చట్టంగా ఆమ్నెస్టీ పేర్కొంది.