టెహ్రాన్, నవంబర్ 25: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవా గ్యాలంట్లకు అరెస్ట్ వారెంట్ జారీచేయటం కాదు, వారికి మరణ శిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి నెతన్యాహూ, గ్యాలంట్లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇటీవల అరెస్టు వారెంట్ జారీచేసింది. దీనిపై అలీ ఖమేనీ స్పందిస్తూ తాజాగా పై వ్యాఖ్యలు చేశారు.
గాజాలో పౌర నివాస ప్రాంతాలపై ఆయుధాలతో దాడి, హత్యాకాండ, అమానవీయ చర్యలకు పాల్పడ్డారని, ప్రజల ఆకలిని కూడా యుద్ధంలో ఆయుధంగా వాడుకున్నారని నెతన్యాహు, గ్యాలెంట్లపై ఐసీసీ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ న్యాయస్థానానికి వారెం ట్ జారీచేసే హక్కులేదని పేర్కొన్నది.