టెహ్రాన్: ఇరాన్లో కరోనా మహమ్మారి ( Corona in Iran ) మళ్లీ ఉధృతమైంది. ఇవాళ కూడా కొత్తగా 8,305 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,04,460కి చేరింది. కరోనా మరణాలు కూడా ఇరాన్లో భారీగానే నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 112 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,27,551కి పెరిగింది. ఇరాన్ వైద్యారోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, మొత్తం కేసులలో ఇప్పటివరకు 56,29,596 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,640 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు 5,54,05,154 మంది ఇరానియన్లు కరోనా తొలి డోస్ టీకాలు తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 4,01,93,198గా ఉన్నది.