Iran | ఇరాన్ (Iran)పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్.. అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది (cancels all flights). పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
కాగా, ఈనెల 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్‌ను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్‌పై ఐడీఎఫ్ ఎదురుదాడులతో విరుచుకుపడింది. మరోవైపు తాజా దాడులపై ఇరాన్ స్పందించింది. మూడు సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పరిమితి స్థాయిలో మాత్రమే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ ప్రకటన చేసింది.
Israel strikes ‘military targets’ in Iran, IDF says, the Capitol of Iran, and Karaj city | at least 5 to 10 loud explosions have been heard already is that #true
🇮🇷💔🇵🇸 #Hizbullah
“World War 3”#Netanyahu#Hamas#iran#tehran#BlockElon#Gaza pic.twitter.com/AJspXIgAWz— Hasan LaLa Meister (@KPK_chronicles) October 26, 2024
Also Read..
Israel | సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
The Mukaab | సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. నిర్మాణ వ్యయం ఎంతంటే?
China | చేయి చూపించి చిటికెలో చెల్లింపు.. చైనాలో సరికొత్త సాంకేతికత