Israel | సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఇజ్రాయెల్ (Israel) అన్నంతపని చేసింది. ఇరాన్‌పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న టెల్అవీవ్.. టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel) అన్నంతపని చేసింది. ఇరాన్‌పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న టెల్అవీవ్.. టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్‌తోపాటు సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఈనెల 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్‌ను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్‌పై ఐడీఎఫ్ ఎదురుదాడులతో విరుచుకుపడుతున్నది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతున్నది, ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత తమకు ఉందన్నారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, ఇరాన్‌పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు సమాచారం. ఇక వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాక్ తన విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది.
Israel strikes ‘military targets’ in Iran, IDF says, the Capitol of Iran, and Karaj city | at least 5 to 10 loud explosions have been heard already is that #true
🇮🇷💔🇵🇸 #Hizbullah
“World War 3”#Netanyahu#Hamas#iran#tehran#BlockElon#Gaza pic.twitter.com/AJspXIgAWz— Hasan LaLa Meister (@KPK_chronicles) October 26, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- IDF
- iran
- Israel
- Israeli military
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

