వాషింగ్టన్: పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడుల వల్ల అమెరికాకు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,520 కోట్లు) నష్టం వాటిల్లి ఉండొచ్చని బీబీసీ విశ్లేషణ వెల్లడించింది. యుద్ధం మొదలైన రెండు వారాల్లోనే అగ్ర రాజ్యం ఆస్తులకు ఈ మేరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన కేంద్రంతో సంయుక్తంగా నిర్వహించిన విశ్లేషణ నివేదికలో బీబీసీ వివరించింది.
గల్ఫ్‌లో ఉన్న అమెరికా మొత్తం ఆస్తుల నష్టాన్ని తాము అంచనా వేయలేదని పేర్కొన్నది. మరింత సమాచారం లభించే వరకు మొత్తం నష్టాన్ని అంచనా వేయలేమని బీబీసీ తెలిపింది. జోర్డాన్‌లోని అమెరికా థాడ్ రాడార్ వ్యవస్థకు ఒక్కటే సుమారు 485 మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని నివేదిక వెల్లడించింది.