బెర్లిన్, ఏప్రిల్ 23 : ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పెహ్లావిపై గురువారం ఒక వ్యక్తి ఎర్రటి ద్రావణాన్ని చల్లి తన నిరసన వ్యక్తం చేశాడు. బెర్లిన్లో ఒక పత్రికా సమావేశానికి హాజరై వస్తుండగా, అదే భవనం బయట ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడినప్పటికీ పెహ్లావి తన అభిమానులకు అభివాదం చేస్తూ తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పెహ్లావీ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ‘ఇరాన్ ప్రస్తుత నాయకత్వంతో సంప్రదింపులు నిష్ప్రయోజనం. ఏ ఒప్పందమూ దీనిని పరిష్కరించదు. ఏ చర్చలూ దీనిని పరిష్కరించవు’ అని ఆయన నొక్కి చెప్పారు.