ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పెహ్లావిపై గురువారం ఒక వ్యక్తి ఎర్రటి ద్రావణాన్ని చల్లి తన నిరసన వ్యక్తం చేశాడు. బెర్లిన్లో ఒక పత్రికా సమావేశానికి హాజరై వస్తుండగా, అదే భవనం బయట ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు చేయాలని కోరారు.