టెహ్రాన్: ఇరాన్ అండర్‌గ్రౌండ్ మిస్సైల్ సిటీని ఆవిష్కరించింది. ఒక పక్క అణు కార్యక్రమాలను నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను బేఖాతరు చేస్తూ తమ ఆయుధ సామర్థ్యాన్ని తెలిపే వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
ఇరానీ రివల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటై, క్షిపణి నగరంగా పిలిచే ఈ స్థావరంలో విస్తృతమైన భూగర్భ సొరంగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలో టాప్ మిలటరీ కమాండర్లు సొరంగ మార్గంలో వాహనంపై ప్రయాణిస్తూ క్షిపణి కేంద్రాన్ని పరిశీంచడం కన్పించింది.